Nita Ambani : భారతదేశ కుబేరు జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ చేయని వ్యాపారం అంటూ లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచంలోని ముకేష్ అంబానీకి ఉన్న సౌకర్యాలు ఎవరికీ లేవనడంలో ఎలాంటి సందేహం లేదు.
పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ నిశ్చితార్థం జరిగిన సందర్భంగా అంబానీ కుటుంబం గురువారం ఒక డ్యాన్స్ షోను ఏర్పాటు చేసింది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్నకొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ముంబైలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట గురువారం అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు.