Nita Ambani : భారతదేశ కుబేరు జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ చేయని వ్యాపారం అంటూ లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచంలోని ముకేష్ అంబానీకి ఉన్న సౌకర్యాలు ఎవరికీ లేవనడంలో ఎలాంటి సందేహం లేదు. లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్‌లు, ఖరీదైన భవనాలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా ఉంటుంది. ముఖేష్ అంబానీలాగే తన భార్య నీతా అంబానీ కూడా విలాసవంతమైన వస్తువులను కలిగి ఉన్నారు. ఆమె ఏ కార్యక్రమానికి హాజరైన తను ధరించిన దుస్తులు, హ్యాండ్ బ్యాగులు ఆ ప్రోగ్రామ్ కే సెంటార్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతాయి. భర్త లాగే ఆమె ఉపయోగించే లగ్జరీ సేకరణలో కార్లు, ఇళ్ళు, జెట్ విమానాలు వంటివి కూడా ఉన్నాయి.
Read Also:King Charles-3: 14 వ శతాబ్ధపు సింహాసనం.. 360 ఏళ్ల నాటి కిరీటం.. నేడు కింగ్ చార్లెస్ 3 పట్టాభిషేకం..
ఇప్పుడు అందరూ ఆమె వాడుతున్న స్మార్ట్ ఫోన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆమె వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైనది. నీతా అంబానీ స్మార్ట్‌ఫోన్ ధర ఊహకు కూడా అందనిది. నీతా అంబానీ వాడే స్మార్ట్‌ఫోన్ ధర ఎంతో తెలిస్తే షాక్ తింటారు. ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యంత ఖరీదైన ఫోన్. దీనికి ఎందుకు అంత ధర ఉంటుందంటే దానిలో పొందుపరిచిన విలువైన పింక్ డైమండ్ కారణం. ఇక ఈ ఫోన్ ధర 48.5 మిలియన్లు డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 395 కోట్లు) చెల్లించాలి. నీతా అంబానీ ఫోన్ ఖరీదుతో కొన్ని చార్టర్డ్ విమానాలను కొనుగోలు చేయొచ్చట. ఈ ఫోన్ నిజానికి iPhone 6 కోసం ఫాల్కన్ సూపర్‌నోవా అనుకూలీకరించిన వెర్షన్. ఇదే ఐఫోన్ 6, 2004లో విడుదలై బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని తయారు చేస్తున్నప్పుడు, ఐఫోన్ 6లో 24 క్యారెట్ బంగారాన్ని ఉపయోగించారు. దానితో పాటు పెద్ద పింక్ డైమండ్ ఫోన్ వెనుక ప్యానెల్‌కు పొందుపరిచారు.
Read Also:Bhatti vikramarka: మహిళా సంఘాలకు భారీ మొత్తంలో వడ్డిలేని రుణాలు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు ఇవి..
ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ (Falcon SuperNova iPhone 6 Pink Diamond)
స్టువర్ట్ హ్యూస్ ఐఫోన్ 4ఎస్ ఎలైట్ గోల్డ్(iphone 4S Elite Gold)
స్టువర్ట్ హ్యూస్ ఐఫోన్ 4 డైమండ్ రోజ్ ఎడిషన్ (iPhone 4 Diamond Rose Edition)
గోల్డ్ స్ట్రైకర్ ఐఫోన్ 3GS సుప్రీం (Goldstriker iPhone 3GS Supreme)
ఐఫోన్ 3G కింగ్స్ బటన్ ( iPhone 3G King’s Button)