దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు,పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశవ్యాప్తంగా 13 భాషల్లో, 499 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మాత్రం నీట్ పరీక్షలు వాయిదాపడ్డాయి. మణిపూర్‌లో పరీక్ష కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులందరికీ రేపు నీట్ పరీక్ష ఉండదని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.
చాట్ బాట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ప్రతిదీ..కేక్ వాక్ దాదని తేలిపోయింది. అందులోనూ భారత్ ప్రతిష్టాత్మకమైన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్ డ్ ను క్లియర్ చేయడం అంత ఈజీ కాదని నిరూపితమైంది.
NEET: ఏడాదికి రెండుసార్లు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ని నిర్వహించేలా జాతీయవైద్య కమిషన్(ఎన్ఎంసీ), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆరోగ్య సహాయమంత్రి భారతి ప్రవన్ పవార్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి ప్రతిపాదన ఏం లేదని ఆమె లోక్ సభకు తెలియజేశారు. నీట్ ను ఏడాదికి రెండుసార్లు నిర్వహించే ఆలోచన లేదని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం లోక్ సభకు తెలిపింది.
Neet Exam: నీట్ పరీక్ష సందర్భంగా కేరళలోని కొందరు విద్యార్థినుల లోదుస్తులు విప్పించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. జూలై 17న కొల్లాం జిల్లా ఆయుర్‌లో నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినులు అవమానానికి గురయ్యారు. మార్థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తనిఖీల సమయంలో కొందరు సిబ్బంది అమ్మాయిల లోదుస్తులు విప్పించారు. పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు బ్రా తీసి వెళ్లాలంటూ ఆదేశించారు. ఈ ఘటనపై కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల లో దుస్తులు…
Neet Exam: దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ కు సర్వం సన్నద్ధమైంది. ప్రతీ సంవత్సరం నీట్ ర్యాంకు ద్వారా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీవీఎస్, ఏహెచ్ సీట్లతో పాటు ఎయిమ్స్, జిప్‌మర్ సీట్లను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 543 నగరాలు, పట్టణాలతో పాటు విదేశాల్లో 13 నగరాల్లో నీట్ ఎగ్జామ్ నిర్వహణ ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా..తెలంగాణ నుంచి 60 వేల మంది ఉన్నారు.
ఆకర్షణీయమైన గదులతో ఆతిథ్యం అందించే ఓయో సంస్థ కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈనెల 17న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయస్థాయిలో జరిగే ఈ పరీక్ష కోసం 18 లక్షల మందికి పైగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఓయో సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు తమ హోటళ్లలో 60 శాతం రాయితీ ఇస్తామని తెలిపింది. అయితే ఇది అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుందని ఓయో వెల్లడించింది. ఈ…
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. నీట్ పీజీ-2022 పరీక్షలు వాయిదా వేయాలని లేఖలో కోరారు. కోవిడ్ కారణంగా గతేడాది నీట్ పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్‌కు అభ్యర్థులు సిద్ధంగా లేరని లోకేష్ తన లేఖలో ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ విద్యార్థుల ఏడాది ఇంటర్న్ షిప్ పూర్తి కాకపోవడంతో వారు నీట్ పీజీ పరీక్షకు అర్హత సాధించే అవకాశం…