నీట్-యూజీ 2024 ఫలితాల వల్ల కోటాలో ఆత్మహత్యలు జరగలేదని, పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ పిటిషనర్లు భావోద్వేగ వాదనలు చేయవద్దని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. కోటాలో కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఒకరు చేసిన ఆరోపణలపై న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీంతో కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. ఎన్టీఏతో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది.