Neeraj Chopra: ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో అరుదైన గౌరవం దక్కింది. భారత సైన్యం ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సమక్షంలో నీరజ్ చోప్రా ఈ గౌరవాన్ని అందుకున్నారు. క్రీడల్లో నీరజ్ సాధించిన అసాధారణ విజయాలు, కోట్లాది మంది యువ భారతీయులకు ఆయన స్ఫూర్తిగా నిలిచినందుకు గుర్తింపుగా…