NDA: ఆదివారం ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాయుధ దళాల పరాక్రమాన్ని, ప్రధాని నరేంద్రమోడీ ధైర్యమైన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.
అమరావతి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు. తన పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపొద్దని నిన్ననే(బుధవారం) చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రతికూల అవగాహనతో ఏర్పడిన పొత్తులు ఎప్పుడూ విఫలమవుతాయని ఎన్డీయే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలోని అశోక హోటల్‌లో మంగళవారం జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయేలో చేరిన కొత్త పార్టీలకు స్వాగతం పలికారు. అభివృద్ధి దిశగా దేశం ముందుకు సాగుతోందని.. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తున్నామని మోడీ పేర్కొన్నారు.
దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బెంగళూరులో 26 విపక్ష పార్టీలు సమావేశం కాగా.. అటు ఢిల్లీలో ఎన్డీయే కూటమి కూడా 38 పార్టీలతో తన బలాన్ని నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది. ఈ రోజు ఢిల్లీలోని అశోక హోటల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఎన్డీయే కూటమి భేటీ జరిగింది.