ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. అమ్మడు ఏ మాయ చేసిందో ఏమోగానీ… టాలీవుడ్ స్టార్స్ అంతా ప్రస్తుతం ఆమె మాయలోనే ఉన్నట్టు, గ్యాప్ లేకుండా ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు. అది కూడా బడా బడా హీరోయిన్లను సైతం మధ్యలోనే తప్పించి మరీ… అమ్మడికి ఆఫర్లు ఇస్తున్నారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీగా… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది…
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ సినిమాలని సైన్ చేసిన హీరోయిన్ శ్రీలీలా మాత్రమే. ఆరు ఏడు సినిమాలకి ఓకే చెప్పి, మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న ఈ కన్నడ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వడానికి రెడీగా ఉంది. చేసింది రెండు సినిమాలే కానీ ఈమధ్య కాలంలో ఏ హీరోయిన్ కి రానంత క్రేజ్ శ్రీలీలకి వచ్చింది. ముఖ్యంగా ధమాకా సినిమాలో రవితేజకి హీరోయిన్ గా నటించిన ఈ కన్నడ బ్యూటీ,…