నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న #NBK107 చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. బాలయ్య కూడా సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఈ యాక్షన్ డ్రామాలో శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. #NBK107 షూటింగ్ నిన్న తెలంగాణలోని సిరిసిల్లలో ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సినిమాకు రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్ గా, సంగీత స్వరకర్తగా తమన్, ఎడిటర్…