లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒక పక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. రౌడీ పిక్చర్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసిన ఈ జంట అందులో సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా విగ్నేష్ దర్శకత్వంలో వసంత్ రవి నటించిన చిత్రం ‘రాకీ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక…
లేడీ సూపర్ స్టార్ నయనతార కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఒక పక్క సినిమాలు మరోపక్క నిర్మాణ రంగంలో రాణిస్తున్న ఈ భామ ఈసారి బ్యూటీ రంగంలోకి దిగింది. తాజాగా రిటైల్ బ్రాండ్ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ఆమె అధికారిక ప్రకటన చేసింది. డెర్మటాలజిస్ట్ రేణిత రాజన్తో కలిసి నయన్ లిప్ బామ్ కంపెనీ ని మొదలుపెట్టినట్లు తెలిపింది. త్వరలోనే ఈ కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలను పంచుకొంటానని నయన్ పేర్కొంది. ఇకపోతే ప్రస్తుతం నయన్ కాత్తువక్కుల…
లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె నటించిన ‘పెద్దన్న’ విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. మరోపక్క నయన్, ప్రియుడితో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల నయన్ బర్త్ డే వేడుకలను విగ్నేష్ గ్రాండ్ గా చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలోనే నయన్ ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. స్టార్…
లేడీ సూపర్ స్టార్ నయనతార విలన్ అవతారం ఎత్తబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం నయనతార, విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా కథ గురించి, నయనతార పాత్ర గురించి కోలీవుడ్ లో పెద్ద రచ్చే…
గురువారం లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు. ఇప్పుడు నయన్ కెరీర్ ఫుల్ పీక్స్ లో ఉంది. 37 ఏళ్ళ నయన్ పుట్టినరోజును సన్నిహితుల సమక్షంలో జరుపుకుంది. పురుషాధిక్యత ఉన్న చిత్ర పరిశ్రమలో అనుకున్నది సాధించి ముందడుగు వేస్తున్న నయన్ కి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తనతో కలసి ప్రస్తుతం సినిమాలో నటిస్తున్న సహనటీనటులు సమంత, విజయ్ సేతుపతి నయన్ బర్త్ డే వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుక చెన్నైలో జరిగింది. ఈ ఫంక్షన్ ఫోటోలను…
కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార స్థానాన్ని శ్రద్ధా శ్రీనాథ్ కైవశం చేసుకుందట. అంటే నయన్ నెంబర్ వన్ ప్లేస్ ని కాదండోయ్! నయన్ నటించవలసిన సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ నటింబోతోందన్నమాట. అయితే దీనికి కారణం మాత్ర బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖానే. ఆయన సినిమాలో నటించే ఆవకాశం రావటంతో తమిళంలో తను కమిట్ అయిన సినిమాను వదిలేసింది నయన్. అంతే ఆ ప్లేస్ లోకి శ్రద్ధా వచ్చి చేరింది. ఇంతకు ముందు ‘పోడా పోడి’, ‘తెనాలిరామన్’,…
స్టార్ హీరోయిన్ నయనతార నాయికగా నటించిన 50వ చిత్రం ‘మాయ’. 2015లో విడుదలైన ఈ తమిళ సినిమా తెలుగులో ‘మయూరి’ పేరుతో డబ్ అయ్యింది. కన్నడలో రీమేక్ అయ్యింది. మూడు భాషల్లోనూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. దాంతో ఆ చిత్ర దర్శకుడు అశ్విన్ శరవణ మరోసారి నయనతారను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో హారర్ మూవీని దర్శక నిర్మాత, నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మించబోతుండటం విశేషం. విఘ్నేష్…
పౌరాణిక చిత్రాల రూపకల్పనలో తెలుగువారిదే పైచేయి. అంతకు ముందు, ఆ తరువాత ఎందరు పౌరాణిక చిత్రాలు తీసి విజయాలు సాధించినా, పురాణగాథలతో తెరకెక్కిన తెలుగువారి చిత్రాల ముందు వెలవెల బోయాయనే చెప్పాలి. ఇక మన తెలుగు చిత్రసీమ పౌరాణిక చిత్రాలలో నిస్సందేహంగా ‘శ్రీలలితా శివజ్యోతి’ వారి పంచవర్ణ చిత్రం ‘లవకుశ’ అగ్రస్థానంలో నిలుస్తుంది. తెలుగువారి తొలి రంగుల చిత్రంగా రూపొందిన ‘లవకుశ’ 1963 మార్చి 29న వెలుగు చూసింది. తెలుగునాట తొలి వజ్రోత్సవ చిత్రంగా ‘లవకుశ’ చరిత్ర…
సమంత అతి త్వరలో ఖతీజాగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. విజయ్ సేతుపతి, నయనతారతో కలసి సమంత నటించిన కోలీవుడ్ మల్టీ స్టారర్ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా నుంచి సమంత ఖతీజా లుక్ విడుదల అయింది. చిత్ర నిర్మాతలు ఈ చిత్రం నుండి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేశారు. ఇందులో విజయ్ రాంబోగా కనిపించనున్నాడు. రంజన్ కుడి అన్బరసు మురుగేశ భూపతి ఓహూందిరన్ పేరునే షార్ట్ కట్ లో రాంబోగా మార్చారు.…
గోపీచంద్, నయనతార జంటగా నటించిన ‘ఆరడగుల బుల్లెట్’ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదలైంది. అయితే ఆశించిన రీతిలో ఈ సినిమా ఫలితం సాధించడంలో విఫలమైంది. తాజాగా ఈ మూవీలో ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఆయన మార్కు కత్తులు, వ్యాన్లు గాల్లోకి ఎగరడం అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి.…