కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్ తార- విగ్నేష్ శివన్ ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు. గురువారం చెన్నైలోని మహాబలిపురంలోని ఒక రిస్టార్ లో అత్యంత సన్నహితుల మధ్య ఈ జంట వివాహం జరిగింది. ఇక పెళ్లి తరువాత నయన్- విగ్నేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మొదట తిరుపతిలోనే వారి వివాహం జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన తిరుపతి నుంచి మహాబలిపురానికి మార్చారు. ఇక పెళ్లి జరిగిన తెల్లారే ఈ జంట దంపతులుగా తొలిసారిగా ఆలయాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం…
ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈరోజే ఎదురయ్యింది.. అని పాడుకుంటున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార అభిమానులు.. ఎప్పుడెప్పుడు ఆమె పెళ్లి పీటలు ఎక్కనుందా అని ఎదురుచూసిన వారికి ఈరోజు ఆ తరుణం రావడంతో సంబరబడిపోతున్నారు. అవును.. ఎట్టకేలకు ఆ ఇద్దరు ఒక్కటయ్యారు. కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్ తార- విఘ్నేష్ శివన్ ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత ఐదేళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్న విషయం విదితమే.. ఈ జంట గురించి చేసినన్ని పుకార్లు మరెవ్వరి…
దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ పెళ్లి బంధంతో ఒకటవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం ప్రేమలోకంలో మునిగితేలిన ఈ లవ్ బర్డ్స్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు.ఈ రోజు(జూన్ 9న) నయన్-విఘ్నెశ్ మహాబలిపురంలోని ఓ రీసార్ట్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. భారీ భద్రత నడుమ అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో కొద్ది గంటలకు ముందు విఘ్నేశ్ కాబోయే భార్య నయనతార గురించి ఓ స్పెషల్ పోస్ట్ షేర్…
సాధారణంగా ఏ స్టార్ హీరోయిన్ కి అయినా తన స్థాయి పెంచుకోవాలని ఉంటుంది. ఆ రేంఙ్ లో ఉన్నప్పుడు ఇండియాకు ప్రాధాన్యత వహించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ కాదు అనదు.. వెళ్లకుండా మానదు. కానీ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రం ఈ అవకాశం వచ్చినా అందుకోలేకపోయింది. 75వ కేన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్ దేశంలోని కేన్స్ నగరంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయిన విషయం విదితమే, ఈ అంతర్జాతీయ వేడుకకు మన దేశం…
సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ ఇటీవల కాలంలో వరుసగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ వస్తోంది. ఇటీవల ‘కన్మణి రాంబో ఖతీజా’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చిన నయన్ తాజాగా ‘O2’ అనే సినిమాతో రానుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానున్న ఈ సినిమాకు విఘ్నేష్ దర్శకుడు. డిస్నీ+ హాట్ స్టార్ లో రాబోతున్న ఈ సినిమా…
రీసెంట్గా వచ్చిన ఆచార్య రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. వెండితెరపై తండ్రీ, తనయులను చూసి తెగ మురిసిపోతున్నారు మెగాభిమానులు. ముఖ్యంగా భలే భలే బంజారా సాంగ్లో రామ్ చరణ్, చిరంజీవి స్టెప్స్ అదరహో అనేలా ఉన్నాయి. ఈ పాటలో చిరు, చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్స్ చూసి ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం ఇండియన్ మైఖెల్ జాక్సన్ రంగంలోకి దిగారు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ మూవీని…
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా రొమాంటిక్ డ్రామా “కాతు వాకుల రెండు కాదల్” మూవీ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా రియల్ లైఫ్ లవ్ బర్డ్స్ బుధవారం తిరుపతికి చేరుకున్నారు విఘ్నేష్ శివన్, నయనతారలు. గురువారం తెల్లవారు జామున తిరుపతి ఆలయాన్ని సందర్శించి, శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ మేరకు విఘ్నేష్ ఇన్స్టాగ్రామ్లో నయనతారతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోసి వైరల్ అవుతోంది. Read Also…
ఈవారం తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవిని ‘ఆచార్య’గా అలరించబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజిఎఫ్2’ తర్వాత భారీ క్రేజ్ తో వస్తున్న సినిమా ఇది. అప్పటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల దర్శకత్వం కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. దీంతో ‘ఆచార్య’కు పోటీగా ఏ సినిమాను విడుదల చేయటానికి ఏ దర్శకనిర్మాతలు ధైర్యం చేయలేదు. అయితే తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ మాత్రం ‘ఆచార్య’కు ముందు ఒక రోజు విడుదల కాబోతోంది. దక్షిణాదిన టాప్…
ఎంతగానో ఎదురుచూస్తున్న తమిళ రొమాంటిక్ కామెడీ “కాతు వాకుల రెండు కాదల్” ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో ఒక వ్యక్తి ఒకే సమయంలో ఇద్దరు అమ్మాయిలతో లవ్ లో పడితే ఎలా ఉంటుంది ? అనే విషయానికి కామెడీ జోడించి ఎంటర్టైనింగ్ గా చూపించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత మధ్య ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆకట్టుకుంటోంది. మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కీలకపాత్రలో కన్పించగా, ట్రైలర్ మాత్రం…