హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. లాడ్వా నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. మంగళవారం పార్టీ ఆఫీసులో పూజ నిర్వహించి.. అనంతరం ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రి సైనీ స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లారు.