తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సంవత్సరం అధికమాసం వచ్చినందున రెండుసార్లు బ్రహ్మోత్సవాలను జరపాలని ఇప్పటి వరకే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసింది.