టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర తన నటనతో ప్రేక్షకులకు సుపరిచితం. 2012లో ‘అందాల రాక్షసి’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన నవీన్ చంద్ర, హీరోగానే కాక వివిధ పాత్రలలో మెప్పిస్తూ వచ్చారు. ముఖ్యంగా, ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నెగెటివ్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మరోసారి పవర్ఫుల్ నెగెటివ్ పాత్రతో సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రానున్న ‘మాస్ జాతర’ చిత్రంలో నవీన్ చంద్ర మాస్ మహారాజ్ రవితేజకు ప్రతికూల పాత్రలో…