ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సహస్ర కలశాభి షేకం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు శ్రీ స్వామి వారలకు పురుషసూక్త, శ్రీ సూక్త, కల్పోక్త, వ్యాసపూర్వక, శోడషోపచార పూజ, సహస్ర నామార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పంచోపనిషత్తులచే మన్యసూక్త, రుద్రాభి షేక పూజలు, సహస్ర కలశాభి షేకం, ప్రత్యేక పూజలు, అర్చనాది ఆరాధన, హారతి…