నేడు మహారాష్ట్రలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. రాజ్‌భవన్‌లోని ప్రాంగంణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.