Today (20-12-22) Business Headlines: ‘ఏపీ బ్యాంక్’కి జరిమానా: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26 లక్షల రూపాయలకు పైగా జరిమానా విధించింది. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంకు.. రూల్స్ పాటించకపోవటంతో ఆర్బీఐ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. మరో 19 కోపరేటివ్ బ్యాంకుల పట్ల కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇందులో 17 బ్యాంకులు ఒక్క గుజరాత్‌కే చెందినవి కావటం గమనించాల్సిన విషయం.
గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం చేసిన సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో తెలంగాణ 3వ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంది. 88 శాతానికి పైగా ఎక్స్‌పోర్ట్స్ కేవలం5 రాష్ట్రాల నుంచే జరగటం విశేషం. ఈ వివరాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిన్న శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య విషయంలో ఏపీ కంటే బీహారే బెటర్ పొజిషన్లో ఉందని కేంద్ర వాణిజ్య…
నేడు రాజ్‌భవన్‌కు వైఎస్ షర్మిల ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతన్న సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు ఆమె పాదయాత్రపై దాడికి పాల్పడ్డారు. అయితే.. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. అయితే.. అరెస్టు అనంతరం బెయిలపై వచ్చిన షర్మిల టీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదంటూ చేసిన కామెంట్లు మరింత ఆజ్యం పోశాయి. ఈ పొలిటికల్ టెన్షన్ నేడు రాజ్‌భవన్‌కు చేరుకోనుంది. వైఎస్ షర్మిల నేటి…