ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీకి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి చెందగా.. సీసీకి గాయాలయ్యాయి. గన్‌మెన్‌కి కూడా గాయాలు…
రెండో రోజు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. నిన్న (మంగళవారం) రాత్రి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఎంపీ మాణిక్కం ఠాగూర్ తో ఆయన సమావేశం అయ్యారు.
సీఎం ఎవరనేది నేడు నిర్ణయిస్తాం: ఖర్గే తెలంగాణ సీఎం ఎవరు? అనే దానిపై ఉత్కంఠకు ఈరోజు తెరపడనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖర్గే సమావేశానికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ సీఎం ఎవరనేది నేడు నిర్ణయిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రానికి సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం అని తెలిపారు. తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు: టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన…
సీఎం ఎవరనేదానిపై నేడు క్లారిటీ: సీఎం ఎవరనేదానిపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులు నేడు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే నిర్ణయాన్ని ఆయన వెల్లడిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్యూ కట్టనుండడంతో ఒక్కరోజులో అధిష్టానం సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తుందా లేదా అనేదానిపై పలు…
ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసులు: నాగార్జున సాగర్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాగర్ నీటి కోసం ఏపీ, తెలంగాణ పోలీసుల వివాదం తారాస్థాయి చేరుతున్నాయి. ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు విజయపురి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులతో పాటు రాష్ట్రంలోని నీటిపారుదల అధికారులపై తెలంగాణ ఎస్పీఎఫ్ను ప్రయోగించారు. అర్థరాత్రి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని, ఏపీ పోలీసులు అనుమతి లేకుండా డ్యాం వద్దకు…
దుర్గం చిన్నయ్య పై కేసు నమోదు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై నెన్నెల పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు బీఆర్ఎస్ కండువాతో ఎమ్మెల్యే వెళ్లారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ వోజ్జల రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పుకుని పోలింగ్ బూత్‌లోకి వెళ్లడం కనిపించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని…
తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య భారతదేశంతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.
ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెలా చివరి ఆదివారం రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ద్వారా భారతదేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు నవంబర్ 26న ఆల్ ఇండియా రేడియోలో 107వ ఎపిసోడ్ ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి వికలాంగులు కూడా బీజేపీ.. ఏఎంపీ మీడియా సెంటర్లో ఈ కార్యక్రమాన్ని వింటారు. దానితో పాటు నాయకులు కూడా హాజరుకానున్నారు. రాజస్థాన్‌లో బంపర్…