Off The Record: జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఈసారి కమల దళానికి ఎలాగైనా చెక్‌పెట్టాలన్న పట్టుదలతో ఉన్నాయి ప్రతిపక్షాలు. అందుకే కీలకంగా ఉన్న విపక్ష నేతలందర్నీ ఒక్కతాటి మీదికి తీసుకువచ్చే ప్రయత్నాలు వివిధ రూపాల్లో జరుగుతున్నాయి. ఒక వైపు మమతా బెనర్జీ, మరో వైపు తాజాగా నితీశ్ కుమార్ ఆ పనిలోనే ఉన్నారు. కాంగ్రెస్‌తో పాటు పలు ప్రాంతీయ పార్టీల అధినేతల్ని కలుస్తున్నారు ఆయన. 2024 సార్వత్రిక ఎన్నికలకు…