ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం.. రెండూ మన భారతదేశం యొక్క జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న జనసేన సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందించారు. తాజాగా పవన్ వారికి ఎక్స్ వేదికగా సమాధానం చెప్పారు.
ఇవాళ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 15వేల మందితో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్న వజ్రోత్సవ సభకు హాజరవుతారు కేటీఆర్. ఇక ఈ సభలో అర్హులైన కొత్త ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయడమే కాకుండా.. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడ చేరుకుని, ఆలయ చెరువు మైదానంలో 15 వేల…