భారత్‌లోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే వరుసలో ఏకధాటిగా 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని నాలుగు రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో ఖతార్‌పేరుతో ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఈ మేరకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్‌ను, రోడ్డు నిర్మాణ ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. ఇంతటి గొప్ప పనిలో రాత్రి, పగలు భాగమైన ఇంజనీర్లు,…