National creators' awards: ప్రస్తుత జనరేషన్‌లో సోషల్ మీడియా హవా నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఇన్‌ఫ్లూయెన్సర్, క్రియేటర్లు పుట్టుకొస్తున్నారు. తమ టాలెంట్ నిరూపించుకునేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టా, యూట్యూబ్, ఫేస్‌బుక్ పలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారామ్‌లు ఇందుకు వేదిక అవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూ ఏజ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు, క్రియేటర్లను గుర్తించేందుకు ప్రభుత్వం ‘‘ నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్’’ ప్రకటించనున్నట్లు అధికారిక వర్గాలు శుక్రవారం తెలిపాయి.