ఆస్తులు అమ్ముతున్న రెడ్డీస్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నెదర్లాండ్స్‌లోని కొన్ని ఆస్తులను మరియు అప్పులను విక్రయించబోతోంది. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన డెల్‌ఫార్మా గ్రూపుతో ఒపందం చేసుకుంది. ఈ సంస్థకు నెదర్లాండ్స్‌లో డాక్టర్ రెడ్డీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బీవీ పేరుతో అనుబంధ సంస్థ ఉంది. దీనికి సంబంధించిన ఆస్తులను, రుణాలను అమ్మటంతోపాటు ఉద్యోగులను ట్రాన్స్‌ఫర్ చేస్తుంది.
Ukraine in Top: రష్యా దురాక్రమణతో సర్వం కోల్పోయిన ఉక్రెయిన్ టాప్‌లో నిలవటమేంటి, అసలు ఆ దేశం ఎందులో టాప్‌లో నిలిచిందని అనుకుంటున్నారా?. నమ్మబుద్ధి కాని నిజమిది. డిజిటల్ కరెన్సీలో ఉక్రెయిన్ నంబర్ వన్ ర్యాంక్ సాధించింది. 2021లో ఆ దేశంలో 12.7 శాతం మంది వద్ద ఇ-నగదు ఉంది.