Nashik Fire Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాసిక్ వద్ద ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 9 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బస్సులో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం జరగడంతో చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.