Palnadu Crime: పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో దారుణహత్య కలకలం సృష్టించింది. స్మశానంలో కాటికాపరిగా పనిచేస్తున్న ఎఫ్రాన్ ను గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. నర్సరావుపేట నుంచి రావిపాడు వెళ్లే రోడ్డులో స్వర్గపురి-2లో ఎఫ్రాన్ కాటికాపరిగా పనిచేస్తున్నాడు. రాత్రి సమయంలో నిద్రపోతున్న ఎఫ్రాన్ పై గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డళ్లతో దాడికి దిగారు. మెడ, గొంతుపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతుడి కుటుంబ సభ్యుల…
Rayapati SambasivaRao: గుంటూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కష్టపడే వారికి టికెట్లు ఇవ్వాలని.. తమ కుటుంబంలో రెండు సీట్లు ఇవ్వాలని చంద్రబాబును అడిగామని.. దీనికి టీడీపీ అధిష్టానం సమాధానం చెప్పాలని రాయపాటి అన్నారు. సత్తెనపల్లి, పెదకూరపాడు, గుంటూరు పశ్చిమలో ఎక్కడ ఇచ్చినా తమ రాజకీయ వారసుడు రంగబాబు పోటీ చేస్తాడని రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. నరసరావుపేట ఎంపీ సీటు కడప వాళ్లకు ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు.…
పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైంది కల్యాణ్ జ్యువెలరీ దుకాణంలో పనిచేసే రామాంజనేయులుగా గుర్తించారు. భర్త అపహరణపై నిన్న పోలీసులకు రామాంజనేయులు భార్య ఫిర్యాదు చేశారు. జంగం బాజితో పాటు అన్నవరపు కిషోర్ మరికొందరు షాపులోకి వచ్చి అపహరించారని ఫిర్యాదు చేశారు. రామాంజనేయులు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో చంటి అనే వ్యక్తి అదృశ్యం వెనుక రామాంజనేయులు ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే…
కొత్త జిల్లా ప్రకటనతో ఏపీలోని కొన్ని ప్రాంతాలలో రియల్ బూమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చుట్టుపక్కల భూముల ధరలు రెట్టింపయ్యాయి.దీంతో పొలాలన్నీ వెంచర్లుగా మారిపోతున్నాయి. గుంటూరు జిల్లాలోని కొత్తగా రాబోతున్న పల్నాడు జిల్లాలో రియల్ బూమ్ ఊపందుకుంది. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రకటనతో పల్నాడు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లా కేంద్రానికి రావాలంటే 125 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. కొత్తగా జిల్లా ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.…