‘అందరూ బాగుండాలి…’ అందరూ చూడొచ్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నరేశ్, ఆలీతో పాటు మెట్రోట్రైన్ ముఖ్యభూమిక పోషించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలన విజయంగా నమోదైన మలయాళ చిత్రం ‘వికృతి’కి ఇది రీమేక్. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు.
సంగీత దర్శకుడు ఏ. ఆర్. రెహమాన్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రాకేశ్ పళిదంను ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తయిన సందర్భంగా నటుడు, చిత్ర నిర్మాత ఆలీ మాట్లాడుతూ, ”మా సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ లభిండం ఆనందంగా ఉంది. సినిమా చూసిన ఐదుగురు సభ్యుల బృందం… నాతోపాటు మా టీమ్‌తో మాట్లాడుతూ చాలాకాలం తర్వాత ఒక మంచి సినిమాని చూశాం అని ప్రశంసిస్తుంటే మేము పడిన కష్టం అంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. నేను ఏ పనిచేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తాను. సెన్సార్ వారి ప్రశంసల తర్వాత ఈ సినిమా చేసే విషయంలో నా డెసిషన్ కరెక్టే అని అర్థమయింది. త్వరలోనే సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ హీరోతో విడుదల చేయిస్తాం. అక్కడే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తాను” అన్నారు.
Also Read
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!