తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుభవం, వైవిధ్యం కలబోసిన సీనియర్ నటుడు వీకే నరేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నరేష్.. కాలానికి తగ్గట్టు తన పాత్రలను మార్చుకుంటూ ఇప్పటికీ తన హవాను కొనసాగిస్తున్నారు. హీరోగా ప్రారంభమైన ఆయన ప్రయాణం.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారినా తనదైన ముద్ర వేసారు. ఇటీవల సినిమాల్లో ఆయన పోషిస్తున్న పాత్రలు కథకు బలాన్ని చేకూరుస్తూ…