తెలంగాణలో సంచలనం కలిగించిన డ్రగ్స్ మరణం కేసుకి సంబంధించి నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ కీలక దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో వెలుగు చూస్తున్న అంశాలు అధికారులనే విస్మయానికి గురిచేస్తున్నాయి. తొలి డ్రగ్స్ మరణానికి సంబంధించిన కేసులో లక్ష్మీపతి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. లక్ష్మీపతి కోసం మూడు నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గోవా, అరకు, విశాఖ, తణుకులో లక్ష్మి పతి తలదాచుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబీకులతో…