వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్నాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకుంటారు. పోలేపల్లి లో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత నారాయణపేట మండలం అప్పక్ పల్లి చేరుకుంటారు.
ఆ జిల్లాలో ఉన్నది మూడే నియోజకవర్గాలు. మూడింటికి మూడు కీలక సెగ్మెంట్లే. ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. ప్రధానపార్టీలు గేర్ మార్చడంతో రాజకీయ వేడి రాజుకుంది. జిల్లా నాదా.. నీదా అన్నట్టు కార్యక్రమాలు జోరు పెంచారు నాయకులు. ఇంతకీ ఏంటా జిల్లా? అక్కడ రాజకీయ ప్రత్యేకత ఏంటి? ఓటర్లు ఎప్పుడెలా స్పందిస్తారో అంతుబట్టదు..! నారాయణపేట జిల్లా. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పునర్విభజన తర్వాత మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ కొత్త జిల్లా పరిధిలోకి వచ్చాయి. అవే…