ఈ యేడాది అక్టోబర్ 5వ తేదీ కింగ్ నాగార్జున అభిమానులకు డబుల్ థమాకా అనుకోవచ్చు. నాగార్జున లేటెస్ట్ మూవీ అక్టోబర్ 5వ తేదీ దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఆ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. సరిగ్గా 33 సంవత్సరాల క్రితం అదే తేదీని నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ‘శివ’ విడుదలైంది. ఈ విషయాన్ని ‘ది ఘోస్ట్’ మూవీ నిర్మాతల్లో ఒకరైన శరత్ మరార్…