నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూరు గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు చివరిరోజుకు చేరుకున్నాయి. లోక కళ్యాణం, విశ్వశాంతి కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులతోపాటు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ స్వామివారిని దర్శించుకోనున్నారు. ప్రతిష్ఠాపన కార్యక్రమాలలో భాగంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ప్రాతరారాధన, సేవాకాలం, నివేదన,…