MPDO Missing Mystery: గత ఆరు రోజుల నుంచి ఎంపీడీవో వెంకటరమణ ఏమయ్యారు..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆరు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళిన ఎంపీడీవో.. బోటింగ్ కాంట్రాక్టర్ 55 లక్షల రూపాయల బకాయి చెల్లించటం లేదని వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు.
నరసాపురం ఎంపీడీవో అదృశ్యంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎంపీడీవో అదృశ్యం విచారణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎంపీడీవో కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై ఆయన ఆరా తీశారు. నరసాపురం ఫెర్రి బకాయిలు అందించాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు.