తమిళ ‘అసురన్’కు తెలుగు రీమేక్ ‘నారప్ప’. అక్కడ ధనుష్ కథానాయకుడు కాగా, ఇక్కడ వెంకటేశ్ హీరోగా నటించారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో దగ్గుబాటి సురేశ్ బాబు, కలైపులి ఎస్ థాను దీన్ని నిర్మించారు. మే 14న థియేటర్లలో రిలీజ్ చేయాలని మొదట భావించినా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడటంతో తప్పని స్థితిలో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. ‘వి’, ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాలు కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఓటీటీలో…