Home
Nara Lokesh
Nara Lokesh News
-
Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
ఏపీలో డీఎస్సీ నిర్వహణ తీవ్ర కుంభకోణంగా మారిందని, రాష్ట్రవ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశమైందని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీలో అంతులేని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, దేశ చరిత్రలోనే ఇంతటి పెద్ద స్కామ్ మరొకటి జరగలేదని ఆరోపించారు. మెగా డీఎస్సీ పేరుతో టీచర్ ఉద్యోగాలను మార్కెట్లో అమ్మకానికి పెట్టారని, అడ్డదారిలో ఉద్యోగాలు ఎలా వచ్చాయో ఆధారాలతో సహా బయటపడుతోందని విమర్శించారు.… -
TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్‌షాప్
TDP Leadership Training Conclave: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో అన్ని రాజకీయ పార్టీలు లోకల్ బాడీ ఎలక్షన్స్‌పై ఫోకస్ పెడుతున్నారు.. అందులో భాగంగా.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలకు నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ‘లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నేతలకు నాయకత్వం, పార్టీ… -
Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ, 2029 నాటికి ఏపీలో మరో మూడు డీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేస్తామని, తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియనివారే తమ ప్రభుత్వంపై… -
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
Perni Nani: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏ రంగంలో దొంగలు ఉన్నా జరిగే నష్టం కంటే.. గురువుల్లో అక్రమాలకు పాల్పడేవారు ఉంటే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయుల్లో అక్రమాలు జరిగితే భవిష్యత్తు సమాజానికే ప్రమాదమని వ్యాఖ్యానించారు. విద్యాశాఖను మంత్రి నారా లోకేష్ కావాలనే తీసుకున్నారని, విద్యావ్యవస్థలో అక్రమాలకు పాల్పడే వారిని ప్రోత్సహించారని పేర్ని నాని ఆరోపించారు.… -
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. అయితే, ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్.. అడ్వకేట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా కలిసి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుందని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. న్యాయపరమైన ప్రక్రియ… -
Nara Lokesh: వాయిదాపడే ప్రసక్తే లేదు.. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి!
Nara Lokesh on AP Local Boy Elections: ఏపీ క్యాబినెట్ సమావేశానికి ముందు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ పార్టీకి చెందిన మంత్రులతో బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త పింఛన్లు, ప్రభుత్వ శాఖల పనితీరు, రైతులు-ప్రజల సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నెల నుంచి దశల వారీగా కొత్త పింఛన్లు అందించేలా చర్యలు… -
Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
Nara Lokesh: పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. విద్యారంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతి, విద్యార్థుల చేరికలు, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చే ఏడాదికి రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత దిశగా తీసుకెళ్లేందుకు మరింత వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా… -
Nepal Floods: నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
నేపాల్‌లో మెరుపు వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ఏడుగురు ఏపీ యాత్రికుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరిలో నలుగురు సురక్షితంగా ఉన్నారని, మరో ముగ్గురి ఆచూకీ ఇంకా లభించలేదని ఏపీ ఢిల్లీ భవన్ అధికారులు మంత్రికి వివరించారు. ఆచూకీ లభించని ముగ్గురిలో కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్‌కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మి ఉన్నట్లు అధికారులు తెలిపారు.… -
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం జిల్లాలో సుజ్లాన్ గ్రూప్ చేపడుతున్న ప్రాజెక్టుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అదనంగా 1.3 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సుజ్లాన్ గ్రూప్ పెట్టుబడులు పెడుతోందని నారా లోకేష్ వెల్లడించారు. ఉరుకొండ వద్ద ఉన్న బ్లేడ్ల తయారీ యూనిట్… -
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
ఏపీ డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, అనంతరం తీసుకున్న నిర్ణయాలపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ.. మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోలు జారీ చేసిందని,…
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
-
MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!