Minister Lokesh: ఈ రోజు చాలా ఆనందంగా ఉంది.. 175 నియోజకవర్గాల్లో లక్షలాది మందితో పోటీ పడి ఇక్కడి వరకు వచ్చారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఒకటి సాధించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.. నేను స్కూల్ కి వెళ్ళేటప్పుడు మాక్ అసెంబ్లీ ఉంటే బాగుండేది అనుకునే వాడిని.. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరికి రాజ్యాంగ విలువలు ఏంటో అందరికి తెలుస్తాయి.. రైతుల సమస్యలపై మాట్లాడాం, చిన్న పిల్లలు మొబైల్స్ కి అడిక్ట్ అవ్వడం గురించి చర్చించాం.. చాలా అంశాలపై ఒక ఎమోషనల్ ఉంటుంది.. పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది.. ఎంతో మంది కృషితో మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు.
Read Also: Madhapur IT Company Scam: మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ.. రోడ్డున పడ్డ 400 మంది..
అయితే, ప్రాథమిక హక్కులను కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. రాజ్యాంగం మనకి చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరి వాయిస్ ముఖ్యమైనది.. రాజ్యాంగాన్ని ఒక గైడింగ్ ఫోర్స్ తో ముందుకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.. రాజ్యాంగం అనేది ఒక ఇన్స్పైర్ సోల్ అన్నారు. ఇక, 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో మోడీ పిలుపునిచ్చారు.. ప్రజలందరూ భాగస్వామ్యం అవ్వాలని కోరారు. నైతిక విలువలతో కూడిన అభివృద్ధి అనేది కావాలి.. కూటమి ప్రభుత్వం విద్యారంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకొచ్చారు.
Read Also: Samsung Black Friday Sale: ‘శాంసంగ్’ స్మార్ట్ టీవీ కొనండి.. 93 వేల ఉచిత సౌండ్‌బార్ పట్టండి!
అలాగే, తల్లితండ్రులు విద్యార్థులు భాగస్వామ్యం చాలా అవసరం ఉందని మంత్రి లోకేష్ తెలియజేశారు. ఇంట్లో అయినా.. ఎక్కడైనా కొన్ని పదాలు వాడకూడదు.. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడొద్దు.. గాజులు తొడుకున్నావా, అమ్మాయి లాగా మాట్లాడుతున్నావ్, అమ్మాయి లాగా నవ్వుతున్నావ్.. ఇలాంటి పదాలు ఎప్పుడు వాడకూడదని చెప్పారు. ఈ మాట మంత్రి నారా లోకేష్ చెప్పాడని చెప్పండి.. తప్పుగా మాట్లాడితే మా అమ్మ చాలా సార్లు మందలించేది.. చిన్నప్పుడు తప్పు చేస్తే గట్టిగా కొట్టేది.. రాజ్యాంగం చాలా విలువైనది.. అందుకే పాదయాత్ర మొత్తం రాజ్యాంగ బుక్ ను నాతో పాటే పెట్టుకున్నాను.. చిన్న వయస్సు నుంచే రాజ్యాంగం మీద పిల్లలకి అవగాహన కల్పించాలని మంత్రి లోకేష్ సూచించారు.