కర్నూలు జిల్లా ఆదోని ఒకప్పుడు టీడీపీకి బాగా పట్టున్న నియోజకవర్గం. ప్రస్తుతం ఆదోని టీడీపీ ఇంచార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కొనసాగుతున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 వార్డులకు గాను.. టీడీపీకి దక్కింది ఒక్క వార్డే. 5 గ్రామ పంచాయతీలలోనే టీడీపీ మద్దతుదార్లు గెలిచారు. రెండు ఎంపీటీసీలు దక్కాయి. పరిస్థితి ఈ విధంగా దిగజారిపోయినా పార్టీ నేతలు వర్గపోరును విడిచిపెట్టడం లేదు. ఆదోనిలో టీడీపీ పరాజయానికి..…