కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచంలో తగ్గుతున్నా, వివిధ వేరియంట్‌లుగా రూపాంతరం చెందుతూ వైరస్ బలం పుంజుకొని తిరిగి ఎటాక్ చేస్తున్నది. వ్యాక్సిన్ తీసుకుంటున్నా కరోనా మహమ్మారి నుంచి కోలుకోలేకపోతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా ఎటాక్ అవుతుండటంతో సమస్యలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్‌లు ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో సెకండ్ వేవ్‌కు ఈ డెల్టా వేరియంట్ కారణం అయింది. ఇప్పుడు దాదాపుగా 130 దేశాల్లో డెల్టా వేరియంట్‌లు ఇబ్బందులు పెడుతున్నాయి.…