కోవూరు శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా రంగానికి చెందిన వ్యక్తులపై చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా ఖండించారు. సినిమా వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదిస్తారే కానీ ఎవరినీ దోచుకుని ఆస్తులు కూడగట్టుకోవడం లేదని అన్నారు. అదే భావనలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే… ప్రజా ప్రతినిధులు, సినిమా వాళ్ళ ఆస్తుల లెక్కలు తీద్దామా!? అంటూ ఆయన సవాల్ విసిరారు. సినిమా రంగానికి కులాన్ని, మతాన్ని ఆపాదించడం ఎంతమాత్రం…