Nani About Kalki Part 2: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గత జూన్ 27న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇతిహాసాలతో కూడిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఓటీటీలో కూడా దుమ్మురేపుతోంది. ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే. కల్కి 2 షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కానుంది. అయితే సీక్వెల్లో కృష్ణుడి పాత్రలో ‘నేచురల్ స్టార్’ నాని ననటిస్తున్నారని…