నమ్రతా శిరోద్కర్.. గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని ఇంటి కోడలిగా, సూపర్ స్టార్ మహేష్ భార్యగా ఆమె ఎన్నో బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తుంది. భర్త మహేష్ కు సంబంధించిన అన్ని విషయాలను ఆమె దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటుంది. ఇక మరోపక్క ఇద్దరు పిల్లలకు తల్లిగా వారిని ప్రేమతో పెంచుతోంది.