ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నల్లంచు తెల్లచీర నవలను గతంలో చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కె.యస్. రామారావు దొంగమొగుడు పేరుతో సినిమాగా నిర్మించారు. అది సూపర్ హిట్ అయ్యింది. అదే విధంగా యండమూరి రాసిన పలు నవలలు అభిలాష, ఛాలెంజ్, మరణ మృదంగం, రాక్షసుడు పేర్లతో సినిమాలుగా వచ్చాయి. ఇక యండమూరి స్వయంగా స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్, అగ్నిప్రవేశం, దుప్పట్లో మిన్నాగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఆయన నల్లంచు తెల్లచీర పేరుతో…