నేటి నుంచి నల్లమల చెంచుల ఆరాధ్య దైవం సలేశ్వరం జాతర ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జాతర కొనసాగనున్నది. తెలుగు రాష్ట్రాల తోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు, యాత్రికులు హాజరుకానున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మసుకృతంగా భావిస్తారు. అటవీ శాఖ ఆంక్షలతో తెలంగాణ అమర్నాథ్ యాత్ర జరగనున్నది. Also Read:US: న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి సలేశ్వరం జాతరకు అధికారులు…
ప్రభుత్వాలు ఎన్ని అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను తీసుకువచ్చినా వన్యప్రాణులను వేటగాళ్ల భారీ నుంచి ఎవ్వరూ తప్పించలేకపోతున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వేటగాళ్లు మాత్రం తమ దారిలోనే అధికారుల కళ్లు గప్పి గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. దీంతో వన్యప్రాణుల సంరక్షణపై తీసుకునే రక్షణ చర్యలపై ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరముందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే వేటగాళ్ల కారణంగా ఎన్నో వన్యప్రాణి జాతులు చివరి దశకు చేరుకున్నాయి. ఉన్న కొన్నింటినైనా కాపాడుకుని భవిష్యత్ తరాలకు వాటిని…