నల్గొండ రూపురేఖలను మార్చేసే నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈపీసీ పద్ధతిలో రూ.524.85 కోట్లతో నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మకమైన ఈ బైపాస్ రోడ్డుకు సంబంధించిన ప్రస్తుత స్థితిగతులపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాలుగు లేన్లుగా 14 కి.మీ నిర్మిస్తున్న ఈ రోడ్డును ఎలక్షన్ కోడ్ ముగియగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా పూర్వపనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.