Crime: బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ పాదాల్లో 10 మేకులు పొడిచిన మృతదేహం లభ్యం కావడం సంచలనంగా మారింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లాలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. నలంద జిల్లాలో గురువారం నాడు పాదాల్లో 10 మేకులు గుచ్చబడిని స్థితిలో మహిళ శవం లభ్యమైంది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జిల్లాలోని చండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పూర్ గ్రామంలో జరిగింది. స్థానిక గ్రామస్తులు…