బీహార్‌లోని రాజ్‌గిర్‌లో చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఉదయం నలంద యూనివర్శిటీకి చేరుకున్న ప్రధాని మోదీ ముందుగా యూనివర్సిటీలోని పాత వారసత్వాన్ని నిశితంగా పరిశీలించారు.
పురాతన నలంద విశ్వవిద్యాలయానికి సమీపంలోని ఒక చెరువులో పూడిక తీసే సమయంలో సుమారు 1,200 ఏళ్ల నాటివిగా భావించబడే రెండు రాతి విగ్రహాలు కనుగొనబడినట్లు భారత పురావస్తు శాఖ అధికారి తెలిపారు.