Nalanda: నలందలో బయటిపడిన 1,200 ఏళ్ల నాటి పురాతన విగ్రహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalanda: పురాతన నలంద విశ్వవిద్యాలయానికి సమీపంలోని ఒక చెరువులో పూడిక తీసే సమయంలో సుమారు 1,200 ఏళ్ల నాటివిగా భావించబడే రెండు రాతి విగ్రహాలు కనుగొనబడినట్లు భారత పురావస్తు శాఖ అధికారి తెలిపారు. ఇక్కడి నుంచి 88 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన నలంద మహావీర సమీపంలోని సర్లిచక్ గ్రామం వద్ద ఉన్న తార్సిన్ చెరువులో ఈ వారం ప్రారంభంలో విగ్రహాలు కనుగొనబడ్డాయి. ప్రపంచ వారసత్వ ప్రదేశం, నీటిని సంరక్షించడానికి బీహార్ ప్రభుత్వం ప్రారంభించిన ‘జల్-జీవన్-హరియాలీ’ ప్రాజెక్ట్ కింద తవ్వకాలు చేపట్టాలు చేపట్టగా ఈ విగ్రహాలు బయటపడినట్లు తెలుస్తోంది. అయితే, రెండు విగ్రహాల వివరాలను ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించలేదు. ఈ ప్రాంతంలో నివసించే గ్రామస్థులు విగ్రహాలు కనుగొనబడిన విషయం తెలుసుకున్నప్పుడు, వారు వీటిని ఉంచడానికి ఒక ఆలయాన్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం ప్రారంభించినట్లు సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ గౌతమీ భట్టాచార్య తెలిపారు.
అక్కడ ఉన్న పురావస్తు శాఖ అధికారాలు గ్రామస్థులు ఏర్పాట్లు గురించి తెలుసుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇప్పుడు 1200 సంవత్సరాల వయస్సు గల రెండు విగ్రహాలు ఇప్పుడు స్థానిక పోలీసుల అదుపులో ఉన్నాయని ఆమె వెల్లడించారు. తాము వాటిని నలంద మ్యూజియంలో ప్రదర్శించాలనుకుంటున్నామన్నారు. ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్, 1878లోని నిబంధనల ప్రకారం ఈ విగ్రహాలను తక్షణమే అందజేయాలని తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించానని గౌతమీ భట్టాచార్య చెప్పారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Petrol Rate: రాష్ట్ర బడ్జెట్‌లో సామాన్యులకు షాక్.. పెట్రోల్ ధర రూ.2 పెంపు
ఏదైనా పురాతన వస్తువులు లేదా నిధి ఉపరితలం క్రింద దొరికినప్పుడు సాధారణంగా స్థానికులు సమీపంలోని దేవాలయం లేదా ఇతర మతపరమైన ప్రదేశాలకు తీసుకువస్తారని అధికారి తెలిపారు. భారతీయ ట్రెజర్ ట్రోవ్ చట్టం, 1878 ప్రకారం, రూ.10 కంటే ఎక్కువ విలువైన ఏదైనా పురాతన వస్తువులు లేదా కళాఖండాలు కనుగొనబడినప్పుడు వాటిని కనుగొనే వారిచే సమీపంలోని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. సంబంధిత జిల్లా కలెక్టర్‌కు నిధిని పొందే అధికారం ఉంటుంది.
“నేను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాను. ఈ చట్టంలోని నిబంధనల గురించి అన్ని జిల్లాల మేజిస్ట్రేట్‌లకు తెలియజేయాలని సంబంధిత అధికారాన్ని అభ్యర్థించాను, తద్వారా నిధులను జిల్లా యంత్రాంగం సురక్షిత కస్టడీలో డిపాజిట్ చేయవచ్చు” అని గౌతమీ భట్టాచార్య చెప్పారు. ఏడాది క్రితం ఇదే చెరువులో పాల కాలం నాటి 1,300 ఏళ్ల నాటి నాగ దేవి విగ్రహం లభించింది. ఇది నలందలోని భారత పురావస్తు శాఖ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచబడింది.
Supreme Court : కొలీజియం సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే ఐదుగురు జడ్జీల నియామకం
నలంద మహావిహార స్థలంలో 3వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు ఉన్న సన్యాసుల, పాండిత్య సంస్థ పురావస్తు అవశేషాలు ఉన్నాయి. ఇందులో స్థూపాలు, పుణ్యక్షేత్రాలు, విహారాలు (నివాస, విద్యా భవనాలు), గార, రాయి, లోహంలో ముఖ్యమైన కళాకృతులు ఉన్నాయి.నలంద భారత ఉపఖండంలోని అత్యంత పురాతన విశ్వవిద్యాలయం. ఇది 800 సంవత్సరాల నిరంతరాయ కాలంలో జ్ఞానాన్ని వ్యవస్థీకృత ప్రసారం చేయడంలో నిమగ్నమై ఉంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!