నాగర్‌కోయిల్ కేసు నిందితుడు కాశీకి జీవిత ఖైదు శిక్ష విధించారు. మహిళలను మభ్యపెట్టి అసభ్యకర వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డబ్బులు వసూలు చేసిన కేసులో నాగర్‌కోయిల్ కాశీకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో మూడో రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభం కాగా.. స్కాట్ క్రిస్టియన్ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.