SLBC : నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలను కుదిపేసిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదానికి 150 రోజులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 22న జరిగిన ఈ ప్రమాదంలో 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ కుప్పకూలడంతో 8 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. ఇప్పటి వరకు కేవలం ఇద్దరి మృతదేహాలనే వెలికితీశారు, మిగతా ఆరుగురు కార్మికుల మృతదేహాలు టన్నెల్‌లోనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నో గో జోన్‌గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశారు. 63 రోజుల పాటు జరిగిన రెస్క్యూ…