నగరి వైసీపీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మంత్రి రోజాపై… వైసీపీలోని ఆమె వ్యతిరేక వర్గం మళ్లీ కత్తులు దూస్తోంది. కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యి కొత్త చర్చకు దారితీసిన వాళ్లంతా పాత పద్ధతిలోకి వచ్చేశారు. సై అంటే సై అంటున్నారు. తాడో పేడో తేల్చుకుంటామని సవాళ్లు విసురుతున్నారు. రోజా మంత్రి అయినా వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా మాటల తూటాలు పేల్చుతున్నారు అసమ్మతి నేతలు. 2014లో నగరి నుంచి రోజా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో ప్రతిపక్ష పాత్రకే పరిమితం.…