శనివారం నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో జరిగిన ఆర్మీ ఆపరేషన్ లో పద్నాలుగు మంది పౌరులు చనిపోయారు. తీవ్రవాదులు జాడ గురించి సమాచారం అందటంతో ప్రత్యేక బలగాలు ఈ చర్యకు దిగాయి. కాని, వారు దాడి చేసింది ఉగ్రవాదులపై కాదు..సామాన్య పౌరులు ప్రయాణిస్తున్న వాహనంపై. ఐతే, ఇది పొరపాటున జరిగిందా, నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది దర్యాప్తులో తేలాల్సి వుంది. మరోవైపు, ఈ సంఘటనను నిరసిస్తూ స్థానికంగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాబోవు రోజులలో ఎలా…