టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ “మాస్ట్రో” ఫస్ట్ సింగిల్ ఈరోజు విడుదల అయ్యింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన “బేబీ ఓ బేబీ” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వీడియో చూస్తుంటే ఈ పాటలో హీరోహీరోయిన్లు గోవా వంటి అందమైన ప్రాంతాల్లో ప్రేమలో మునిగితేలుతున్నట్లు అన్పిస్తోంది. ఇక ఈ లవ్ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి పాడారు. వినసొంపుగా ఉన్న ఈ సాంగ్ కు శ్రీజో లిరిక్స్ అందించారు. ఈ సాంగ్…
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న విభిన్నమైన చిత్రం “మాస్ట్రో” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ “బేబీ ఓ బేబీ” లిరికల్ ప్రోమో విడుదల చేసి వారి ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. సరికొత్త స్వరాలతో రొమాంటిక్ గా ఉన్న “బేబీ ఓ బేబీ” సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ పాట సినిమాలో హీరోహీరోయిన్లు అయిన నితిన్, నభా నటేష్ లపై చిత్రీకరించబడింది. వీరు సాంగ్ లో గోవాలోని అందమైన ప్రదేశాలలో ప్రేమలో మునిగి తేలుతున్నట్లు…
నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మాస్ట్రో’. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన సంగతి తెలిసిందే. హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించి షూటింగ్ ముగించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్…
హిందీలో విజయవంతమైన ‘అంధాధున్’ కు రీమేక్‌గా తెలుగులో ‘మాస్ట్రో’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తుండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్‌కు జోడీగా నభా నటేష్ నటిస్తోంది. తమన్నా ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. అయితే ‘అంధాధున్’ సినిమాలోని టబు పాత్ర పోషిస్తున్న తమన్నా రీసెంట్ గా స్పందించింది. ‘అంధాధున్’ రీమేక్ చేస్తున్నానని తెలిసినప్పటి నుంచి, దాని ఒరిజినల్ చూడకూడదని నిర్ణయించుకున్నట్లు తమన్నా చెప్పింది. తెలుగులో తాను మరింత కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తున్నానని…
శ్రీరామనవమి సందర్భంగా నితిన్ అభిమానులకు శుభాకాంక్షలు అందచేస్తూ, ‘మాస్ట్రో’ మూవీ టీమ్ ఈ రోజు ఉదయం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. స్కూటర్ పై నితిన్ ను ఎక్కించుకుని, నభానటేష్ డ్రైవ్ చేస్తున్న ఆ ఫోటో చూసి, చాలామంది ఆశ్చర్యానికి లోనయ్యారు. పండగ సందర్భంగా ఇలాంటి గ్లామర్ పోస్టర్ విడుదల చేశారంటీ అనే చర్చ కూడా సాగింది. ఇదిలా ఉంటే… ఈ పోస్టర్ లో డ్రైవింగ్ చేస్తున్న నభాతో, నితిన్ సైతం హెల్మెట్ పెట్టుకోవడం విశేషం.…